T- బీజేపీని గాడిన పెట్టేందుకు అమిత్ షా బిగ్ స్కెచ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-14 03:26:55.0  )
T- బీజేపీని గాడిన పెట్టేందుకు అమిత్ షా బిగ్ స్కెచ్!
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకకు ముందు బీజేపీలో సంక్షోభానికి తెరపడినట్లయింది. హైకమాండ్ ఆదేశాలతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొత్తగా 125 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను విడుదల చేశారు. దీంతో బండికి హైకమాండ్ ఫుల్ పవర్స్ ఇచ్చినట్లయింది. ఎన్నికల తరుణంలో అధ్యక్షుడి మార్పు ఉండబోదనే సంకేతాలను పంపించారనే చర్చ జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: సమన్వయలేమితో కర్ణాటకలో అధికారాన్ని పోగొట్టుకున్న బీజేపీ తెలంగాణలోనూ అదేరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. రాష్ట్ర నాయకత్వంలో మా ర్పులు, ఈటల రాజేందర్ కు కీలక బాధ్యత లు అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు ఈటలకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో మరోవర్గం భేటీ అయ్యింది.

అంతకుముందే బండి సంజ‌య్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అసమ్మ తి సమావేశం జరిగింది. ఈ గ్రూపులు, విభేదాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సైతం సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఖరారవడం, వీటిపై ఆయన ఎలా స్పందిస్తారోనని నేతలకు టెన్షన్ పట్టుకున్నది.

నేడు కోర్ కమిటీతో అమిత్ షా భేటీ..

ఖమ్మం సభకు ఒక రోజు ముందే అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. బీజేపీ కోర్ కమిటీతో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో నేతల మధ్య సమన్వయ లేమిపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. కర్ణాటక ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను వివరించే చాన్స్ ఉంది. కలిసి వెళితే పార్టీకి, వ్యక్తిగతంగా నాయకులకు కలిగే ప్రయోజనాలను అమిత్ షా వివరించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ ఏం చేయాలి? జాతీయ నాయకత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది.

లైన్ తప్పుతున్న నేతలకు క్లాస్..

రాష్ట్ర కమిటీలో మార్పులు చేర్పులంటూ జరుగుతున్న ప్రచారంపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఇలా చేస్తే వారికి కలిగే లబ్ధి ఏంటనే అంశాలపై అమిత్ షా వివరాలు తెలుసుకునే అవకాశముంది. ఈ ప్రచారంతో పార్టీ కార్యకలాపాలు క్రమంగా తగ్గడంపైనా జాతీయ నాయకత్వం ఆరా తీయనున్నది. అంతేకాకుండా పార్టీ లైన్ తప్పుతున్న నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకునే అవకాశమున్నట్లు చర్చ జరుగుతున్నది.

ఖమ్మం సభకు ఒకరోజు ముందు రావడానికి ఇదే కారణమని తెలుస్తున్నది. కాగా, షా రాకకు ఒకరోజు ముందుగానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించడంతో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగబోదనే పరోక్ష సంకేతాలు హైకమాండ్ అందించినట్లయింది. మరి అమిత్ షా టూర్ తో తెలంగాణ బీజేపీ బండి పట్టాలెక్కుతుందా? నేతల మధ్య సయోధ్య కుదురుతుందా? సొంత పార్టీలోనే నేతలు సమరం కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి.

Also Read...

గెలుపు కష్టమే! బీఆర్ఎస్ సిట్టింగులు, లీడర్లలో టెన్షన్

Advertisement

Next Story

Most Viewed