- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Allu Arjun Case: విపక్షాలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) కేసును రాజకీయం చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్(Congress) నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడా సెలబ్రిటీలకు విపక్షాలు అండగా ఉండటం, ప్రభుత్వంపై ఉన్న కోపంతో వారికి సపోర్ట్ చేయడం సరికాదని అన్నారు. పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారని తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన వల్ల ఒక కుటుంబం రోడ్డున పడింది. అల్లు అర్జున్ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం కేసు న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది కాబట్టి.. మిగతాదంతా కోర్టు చూసుకుంటుంది. దయచేసి ప్రభుత్వంపై బురదజల్లేలా రాజకీయం చేయొద్దని విపక్షాలకు బల్మూరి వెంకట్ రిక్వెస్ట్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండని హితవు పలికారు. మరోవైపు.. అల్లు అర్జున్‌కు(Allu Arjun) తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) ఊరట లభించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.