- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. నటుడు అల్లు అర్జున్ అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ క్రాస్ రోడ్ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)ను చిక్కడపల్లి (Chikkadpally) పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రి (Osmania Hospital)కి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు (Nampally Court)కు తరలించనున్నారు. కాగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మికా మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన పుష్ప-2 ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad)లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద విషాదం చోటుచేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ (Allu Arjun) థియేటర్ వద్దకు రాగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
అయితే, అదే సమయంలో ప్రిమియర్ షో (Benifit Show) చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar) నుంచి రేవతి (39), భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్ (9), సన్వీక (7) సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా, కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడిపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై 105 (నాన్ బెయిలబుల్), 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా, ఈ కేసులో ఇవాళ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒక వేళ కోర్టులో నేరం నిరూపితం అయితే అల్లు అర్జున్‌కు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు.