- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పరీక్షలన్నీ రద్దుచేసి మళ్లీ నిర్వహించాలి: కోదండరాం
దిశ, అంబర్‌పేట్: టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలన్నింటినీ రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ పేపర్ లీకైందన్న వార్త తెలిసి హైదరాబాద్‌లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద అభ్యర్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కోదండరామ్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలన్నీ రద్దుచేసి మళ్లీ నిర్వహించాలన్నారు. అనేకమంది విద్యార్థులు ఆత్మ బలిదానలతోనే తెలంగాణ ఏర్పడిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణలో గడిచిన 8 ఏళ్లుగా నోటిఫికేషన్లు విడుదల చేయలేదని, లేక లేక విడుదల చేసిన నోటిఫికేషన్లలో అవకతవకలు జరగడం అన్యాయమన్నారు. 30 లక్షల మంది విద్యార్థులు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.