Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్.. ఓ వైపు పరీక్ష మరోవైపు సుప్రీంలో వాదనలు

by Prasad Jukanti |
Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్.. ఓ వైపు పరీక్ష మరోవైపు సుప్రీంలో వాదనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మరికాసేపట్లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయ5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే జీవో 29 రద్దు చేసి, పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థుల ఆందోళన, ప్రతిపక్షాల డిమాండ్ల మధ్యలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 31,383 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్న ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని భారీ బందోబస్తు మధ్య 46 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద బీఎన్ ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు సుప్రీంలో వాదనలు:

గ్రూప్-1 నియామకాల్లో జీవో 29 రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఇవాళ జరిగే పరీక్షను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు. పరీక్ష ఇదే రోజు ఉన్నందున త్వరగా పిటిషన్ విచారించాలని కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్ ను ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు సీజేఐ ధర్మాసనం విచారించనున్నది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story