- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anil Kumar Yadav: రాజ్ పాకాల ఇష్యూ.. ఆ పని చేయడానికి కేటీఆర్ కు సిగ్గుండాలి: ఎంపీ అనిల్ కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అన్నారు. డ్రగ్స్ (Drugs) బయటపడిన ప్రతిసారి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ ప్రీ స్టేట్ గా చేయాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ ను ప్రేరేపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏమి చేయాలనుకుంటుందని నిలదీశారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్ పాకాల (Raj Pakala) తనకు డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి (Vijay Madduri) ఒప్పుకున్నారని అలాంటి రాజ్ పాకాల, విజయ్ మద్దూరికి మద్దతు తెలిపుతున్న బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Farm House) అంటేనే కాంట్రవర్సీ అన్నారు. విజయ్ మద్దూరిని కేటీఆర్ వెనుకేసుకురావడానికి అసలు మతలబు ఏంటని ప్రశ్నించిన అనిల్ కుమార్ యాదవ్.. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ ను స్కూల్స్ పిల్లల వరకు చేర్చారని ధ్వజమెత్తారు. రాజ్ పాకాల విషయంలో కేసీఆర్ (KCR) ఏకంగా డీజీపీకి ఫోన్ చేసి దబాయిస్తున్నారని ఆయనకు ఎందుకింత పర్సనల్ ఇంట్రెస్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ప్రజలు చర్చించుకుంటున్నారని తెలంగాణలోనే ఉన్నారా లేక పక్క రాష్ట్రంలో ఉన్నారా చెప్పాలన్నారు.