Akbaruddin Owaisi: నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. ఆ పని మాత్రం చేయొద్దు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-26 07:50:19.0  )
Akbaruddin Owaisi: నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. ఆ పని మాత్రం చేయొద్దు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కానీ ఆ స్కూల్‌ను మాత్రం కూల్చొద్దంటూ ఎంఐఎం శాసససభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కళాశాలను ‘హైడ్రా’ కూల్చివేయబోతోందని వస్తున్న వార్తలపై తొలిసారిగా ఇవాళ ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టి పెట్టుకుని బండ్లగూడలో ఫాతిమా ఓవైసీ పేరున 12 భవనాలతో కళాశాలను నిర్మించానని తెలిపారు. ఇప్పుడు వాటిని కావాలనే కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే తనపై కాల్పులు జరగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండని ఎమోషనల్ అయ్యారు. కత్తులతో దాడి చేయండి.. కానీ నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతోన్న విద్యా సంస్థకు అడ్డుపడొద్దని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed