హిమాచల్ ఎఫెక్ట్ : తెలంగాణపై ఏఐసీసీ నజర్..రేవంత్ రెడ్డి పోస్ట్ డౌటేనా?

by samatah |   ( Updated:2022-12-10 15:35:29.0  )
TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా బీజేపీ దూకుడు పెంచుతుంతే ఇంటి పోరుతో కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేక పోతోంది. దీంతో హస్తం పార్టీ వచ్చే ఎన్నికల లోపైనా కుదురుకుంటుందా లేక ఆధిపత్య పోరులను ఇలానే కంటిన్యూ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఫలితంతో కాస్త ఊపుమీదున్న ఆ పార్టీ ఇక కర్ణాటక, తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

పార్టీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడం ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం వలసలను ఆపడంలో విఫలం అవుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పార్టీని వీడుతున్న వారు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితిపై ఫోకస్ పెట్టిన ఏఐసీసీ త్వరలో భారీ మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీని తిరిగి గాడిన పెట్టాలంటే పీసీసీని మార్చాలా లేక ఇన్ ఛార్జిని మార్చితే సరిపోతుందా అనే లెక్కలు వేసుకుంటోందట. ఇందులో భాగంగా మాణిక్కం ఠాగూర్ ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ వరుసగా ఓటమి పాలవుతున్నా ఇన్ చార్జీగా సమీక్షలు నిర్వహించడం లేదని, నేతల మధ్య సమన్వయం చేసే విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు ఆయనపై ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు తనపై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి లీగల్ నోటీసులు ఇవ్వడానికి ఆసక్తి కనపరుస్తున్న మాణిక్కం ఠాగూర్ వారి ఆరోపణలు తిప్పి కొట్టడంలో కానీ పార్టీ నేతల నడుమ సమన్వయం చేసందుకు టైం ఇవ్వడం లేదట. ఈ కారణాలతో ఆయన్ను తప్పించి ఆయన స్థానంలో మరో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కోమటిరెడ్డి కోసం స్పషల్ డిసిషన్!

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్యూను సైతం సాధ్యమైనంత త్వరగా చెక్ పెట్టాలనే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేస్తోన్నట్టు తెలుస్తోంది. ఆయన విషయంలో చెలరేగిన గందరగోళానంతటిని తొలగిచి తిరిగి ఆయన్ను పార్టీలో యాక్టివ్ చేసేందుకు భారీ ప్రణాళికతో పార్టీ పెద్దలు ముందుకు రాబోతున్నారట. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అయితే ఇదే గనుక జరిగితే పీసీసీ విషయంలో తనకు సెకండ్ ప్రయార్టీనే అనే భావన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో కలుగిగే అవకాశాలు ఉన్నాయని అందువల్ల పీసీసీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన అంగీకరిస్తారా అనేది సందేహంగా మారింది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ విజయం వెనుక ప్రియాంక గాంధీ చొరవ కాంగ్రెస్ శ్రేణుల్లో సంచలనంగా మారింది. అంతకు ముందు నుంచే ఆమెను దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ చార్జీగా పంపుతారనే ప్రచారం జరిగింది. తాజా విజయంతో ఆమె పట్ల పార్టీ క్యాడర్ లో మరింత విశ్వాసం పెరిగిందని ఆమెను తెలంగాణతో దక్షిణాది రాష్ట్రాల మానిటరింగ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. కర్ణాటకలో అంతర్గతంగా పర్వాలేదు అనిపించినా తెలంగాణలో మాత్రం సిట్యుయేషన్ అధిష్టానానికి సవాలుగా మారింది. హిమాచల్ ప్రదేశ్ వ్యవహరాలు చక్కబెట్టిన అనంతరం సౌత్ ఇండియాపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి లాంటి సీనియర్ల అలక పార్టీకి కొంప ముంచేలా మారుతోందనే చర్చ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలతో రాబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story