బిగ్ బ్రేకింగ్: కొత్త పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC

by Satheesh |   ( Updated:2023-03-29 15:21:10.0  )
బిగ్ బ్రేకింగ్: కొత్త పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC
X

దిశ, వెబ్‌డెస్క్: పేపర్ల లీక్ నేపథ్యంలో రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల కొత్త తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ప్రకటించింది. మే 8వ తేదీన ఏఈఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరీక్షలు.. మే 9వ తేదీన అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ పరీక్షలను ఆన్ లైన్‌లో నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్పీ బుధవారం వెల్లడించింది. మే 21వ తేదీన సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. ఇక, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో పెను దూమరం రేపిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ కావడంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ.. మరి కొన్ని పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed