108 వాహనంలో మహిళ ప్రసవం - తల్లీబిడ్డ క్షేమం

by Sumithra |
108 వాహనంలో మహిళ ప్రసవం - తల్లీబిడ్డ క్షేమం
X

దిశ, నిర్మల్ కల్చరల్ : పురిటి నొప్పులు పడుతున్న ఓ గర్భిణీ మహిళను నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన నిర్మల్ మండలం కొండాపూర్ లో జరిగింది. మామడ మండలం కమల్ కోట్ తండా కు చెందిన జాదవ్ సరోజకు పురిటినొప్పులు రావడంతో బుధవారం కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ సురేష్, పైలెట్ రాజన్న మహిళను 108 అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామానికి చేరుకోగానే పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ సురేష్ అంబులెన్స్ లోనే చికిత్స అందించి పురుడు పోశారు. గర్భిణీకి ఇది రెండవ కాన్పుకాగా, మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని, మెరుగైన చికిత్స కోసం ప్రసూతి ఆసుపత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఇందులో ఆశా కార్యకర్త అనిత తదితరులున్నారు. చాకచక్యంగా వ్యవహరించి 108 వాహనంలోనే వైద్యసేవలందించి పురుడుపోసిన వాహనసిబ్బందిని పలువురు అభినందించారు.

Advertisement

Next Story