- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం
దిశ, ఉట్నూర్ : రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందొద్ధని, అర్హులైన రైతుకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించారు. ఉట్నూర్ మండలంలోని నర్సపూర్(బి), గండిగూడ గ్రామాలలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా గ్రామంలో కొలుదిరిన గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం మొక్కలు నాటారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. రుణమాఫీ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని, సాంకేతిక కారణాల వల్ల సమస్య తలెత్తిందని తెలిపారు.
త్వరలో 2 లక్షల లోపు రుణాలు కలిగిన రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో కరెంటు కోతలు విధించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పంట నష్ట పోయిన రైతులను గుర్తించి వారికి నష్ట పరిహారం అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.