- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఈఓని సస్పెండ్ చేయాలి.. టీపీటీఎల్ ఎఫ్ నిరసన
దిశ, తాండూర్ : మంచిర్యాల డీఈఓ వెంకటేశ్వర్లు పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్ల కార్డ్స్ తో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర కన్వీనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్కూల్స్ కి సెలవులు ప్రకటించాక కూడా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తున్నాయన్నారు.
డీఈఓ వెంకటేశ్వర్లుకు టీచర్ ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వాల్సిన డీఈఓ అడ్డగోలుగా బూతులు తిట్టడం సిగ్గుచేటన్నారు. సంఘం జిల్లా నాయకులు భీం రావు, మారుతి మాట్లాడుతూ డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఏఫ్ఐ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, నాయకులు పవన్, చంద్రశేఖర్, లెక్చరర్స్ శ్యాంసుందర్, సుప్రీం, నవల పాల్గొన్నారు.