ఆ ఊర్లో మాంసం తినరు.. మద్యం తాగరు..ఎక్కడంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-09-04 15:50:25.0  )
ఆ ఊర్లో మాంసం తినరు.. మద్యం తాగరు..ఎక్కడంటే?
X

దిశ, భైంసా: మద్యానికి, మాంసానికి బానిసై పేద కుటుంబాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతూ..ఎన్నో సందర్భాల్లో పలువురి కుటుంబాలు ఆత్మహత్యలు సైతం చేసుకున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వింటూనే ఉన్నాం. అలాంటిది ముధోల్ తాలూకా లోని తానూరు మండలం "ఝరి" గ్రామం మద్యానికి దశాబ్ద కాలంగా దూరంగా ఉండగా..మరోచోట ముధోల్ మండలం "మచ్కల్" గ్రామంలో మాంసాహారానికి దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మద్య నిషేధానికి దశాబ్దం..

మహారాష్ట్ర సరిహద్దు తానూరు మండలం ఝరి గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. 2013లో మద్యం దుకాణాలను నిషేధించారు. దీంతో గ్రామస్తులలో గొడవలు తగ్గాయి. మందుకు బానిసైన వారు మందు బంద్ చేసి కూలీ రైతులు గా మారారు. ఈ క్రమంలో వివాహ వేడుకల ఖర్చును ఆదా చేసే దిశగా గ్రామస్తులు ఒకే ముహూర్తాన్ని ఖరారు చేసి, గ్రామస్తులు వివాహాలు జరిపిస్తున్నారు. పిల్లలను చదువులలో ప్రోత్సహించేందుకు బహుమతులు సైతం అందిస్తున్నారు. గణపతి ఉత్సవాల్లో సైతం ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐక్యతను చాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామస్తులు అధికారులు ప్రశంసలను సైతం అందుకుంటున్నారు.

మాంసానికి దూరంగా మచ్కల్..

ముధోల్ మండలంలోని మచ్కల్ గ్రామస్తులు మాంసాహారానికి దూరంగా ఉంటూ శాకాహారులు గా మారారు. గ్రామంలో దాదాపు వెయ్యి మంది జనాభా ఉండగా... ఇక్కడ ఒక్క మాంసం దుకాణం కూడా లేదు. సాంప్రదాయాన్ని పాటించే అందరూ శాకాహారులే..! 70 ఏండ్లు ఆ గ్రామం ఏ కార్యక్రమం జరిగిన మాంసం వండడం,తినడం లేదు. ఇది ఈ గ్రామం ప్రత్యేకత.

Advertisement

Next Story

Most Viewed