Bandi Sanjay పాదయాత్రలో మార్పులు.. నేరుగా అడెల్లికి T-BJP చీఫ్..!

by Satheesh |   ( Updated:2022-11-28 11:10:28.0  )
BJP is Ready for Elections, Says Bandi Sanjay
X

దిశ, ప్రతినిధి నిర్మల్: ఐదవ విడత పాదయాత్ర చేపట్టేందుకు బైంసా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో.. మారిన సమీకరణల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో మార్పులు చేసుకున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సోమవారం రాత్రి వరకు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యదర్శి మనోహర్ రెడ్డి మీడియాకు తెలిపారు. అయితే బండి సంజయ్ నేరుగా నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామానికి చేరుకుంటారు. ఇక్కడి ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం అడెల్లిలో కొలువుదీరిన మహా పోచమ్మ ఆలయంలో ఆయన మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం 6 గంటలకు అక్కడినుంచి సారంగాపూర్ మండల కేంద్రం దాకా కాలినడకన వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పటేల్ అక్కడే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మంగళవారం మళ్లీ ఒకసారి తన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో బీజేపీ తీర్థం తీసుకునేలా కార్యక్రమాన్ని కాస్త మార్చుకున్నారు.

అయితే బండి సంజయ్ కూడా తన పాదయాత్రను సోమవారమే ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో పూజల తర్వాత కిలోమీటర్‌కు పైగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టనున్నారు. ఒకవేళ అలా కుదిరని పక్షంలో నేరుగా ఆయన నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకొని బైంసా రోడ్లో ఉన్న మారుతి ఇన్ హోటల్లో బస చేస్తారు. అనంతరం కొత్త రూట్ మ్యాప్ ప్రకారం మంగళవారం భారీ బహిరంగ సభ, రామారావు పటేల్ చేరిక తదితర కార్యక్రమాల అనంతరం ఆయన తన ఐదవ విడత పాదయాత్ర కార్యక్రమాన్ని బైంసా సమీపంలో ఏర్పాటు చేయనున్న సభ వేదిక వద్ద నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల సమయంలోనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించిన నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఆయన నిర్మల్లోనే ఉండనున్నారు. ఒంటిగంటకు ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఆయన భైంసా బహిరంగ సభ వేదికకు చేరుకొని కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

BREAKING: వైఎస్ షర్మిల అరెస్ట్.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత

Advertisement

Next Story

Most Viewed