క్వింటా కందుల ధర రూ.7 వేల 550

by Sridhar Babu |
క్వింటా కందుల ధర రూ.7 వేల 550
X

దిశ, ఆదిలాబాద్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అన్నదాత మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామల దేవి అన్నారు. గురువారం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కంది కొనుగోలు ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అధికారులతో కలిసి కొనుగోళ్లను ప్రారంభించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద పంటను విక్రయింకొని మద్దతు ధర పొందాలని కోరారు. ముందుగా కంది పంటను మార్కెట్ కు తీసుకొచ్చిన రైతును సన్మానించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.7550 తో కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఇందులో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed