- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ సమేతంగా వేలాల మల్లన్న దర్శించుకున్న ఎమ్మెల్యే
దిశ, మందమర్రి : చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద శుక్రవారం మహాశివరాత్రి ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా వేలాల మల్లన్న ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ గట్టు మల్లన్న దేవుడిని ప్రజలు ఆరాధ్య దైవంగా భావిస్తారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే కొలువైన దేవునికి శివరాత్రి పర్వదినం పండుగ సందర్భంగా పూలు పళ్ళు మొక్కులు భక్తులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ జాతరకు మహారాష్ట్ర గడ్చిరోలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యంతో పాటు వివిధ సేవలు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సేవలను అందిస్తుంది. వేలాల గుట్ట పైనున్న మల్లన్నను దర్శించుకోవాలంటే కాలినడక మార్గమే శ్రేయస్కరమని ఎమ్మెల్యే అన్నారు.
భక్తులకు అంజనీపుత్ర మజ్జిగ పంపిణీ
వేలాల గట్టు మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తులకు అంజని పుత్ర రియల్ ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ ఎండి పిల్లి రవి తదితర బృందం మజ్జిగను పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఉపవాసాలతో మల్లన్నను దర్శించుకుంటారని అన్నారు. ఈ భక్తుల కొరకు ఉడుత సహాయంల మజ్జిగను పంపిణీ చేసి కొంతమంది దాహార్తిని తీర్చడంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిషన్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.