- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ : ఎమ్మెల్యే చిన్నయ్య
దిశ,బెల్లంపల్లి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనీయంగా నిలిచాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 105 మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.1,05,12,180 (ఒక కోటి ఐదు లక్షల పన్నెండు వేల నూట ఎనభై రూపాయలు ) కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశవ్యాప్తంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప రాష్ట్రంలో కూడా కళ్యాణలక్ష్మి షాదీముభారఖ్ పథకం లేదని వెల్లడించారు.
ఈ సంక్షేమ పథకాలు భారతదేశంలోని పేద ప్రజలందరికీ అందాలంటే సీఎం కేసీఆర్ కు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. అప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు పేద ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.