- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికల సంక్షేమ పాఠశాలలో విద్యార్థిని మృతి
దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీవాణి అనే విద్యార్థిని మృతి చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. శనివారం పాఠశాలలో శ్రీ వాణి తనకు కాళ్లు చేతులు లాగుతున్నట్లు తెలిపింది. దీంతో పాఠశాల సిబ్బంది వైద్య సేవలు అందించినా.. అప్పటికీ పరిస్థితి విషమించడంతో కాగజ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. శ్రీవాణి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందినది. శ్రీవాణి అకస్మాత్తుగా మృతి చెందడంతో గురుకుల పాఠశాలలో విషాద వాతావరణం అలముకుంది. తోటి విద్యార్థి మృతి చెందడంతో ఆ పాఠశాల విద్యార్థినులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే: తల్లిదండ్రుల ఆరోపణ
సిర్పూర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కూతురు వైద్య అందక మృతి చెందిందని విద్యార్థి శ్రీవాణి తల్లిదండ్రులు లలిత, సమ్మయ్యలు ఆరోపించారు. తమ కుమార్తె మృతి చెందిందన్న మరణ వార్త విన్న వెంటనే వారు పట్టణానికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద బోరున విలపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందంటూ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాగజ్ నగర్ ప్రభుత్వాసుపత్రి ఎదుట అఖిలపక్షం ఆందోళన..
కాగజ్నగర్ ప్రభుత్వాసుపత్రి ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళన చేశారు. విద్యార్థి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, బీజేపీ నేత పాల్వయి హరీష్ బాబు ఆరోపించారు. పాఠశాలలో సదుపాయాలు లేకపోవడం సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే విద్యార్థి మృతి చెందిందని, ఈ విషయంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట బీజేపీ, సీపీఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.