ఇన్స్టాగ్రామ్ లో యువతిని వేధిస్తున్న విద్యార్థి అరెస్ట్

by Disha Web Desk 11 |
ఇన్స్టాగ్రామ్ లో యువతిని వేధిస్తున్న విద్యార్థి అరెస్ట్
X

దిశ, మామడ : నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రానికి చెందిన 18 సంవత్సరాల ఓ యువకుడు గత కొంతకాలంగా ఓ యువతని ఇన్ స్ట్రా గాం లో వేధిస్తుండడంతో శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. యువతి, ఆమె చెల్లెలితో దిగిన ఫోటోలకు ను ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని ఉద్దేశ్యంతో నిందితుడు ఇన్ స్టాగ్రమ్ లో ఒక ఫేక్ ఐడిని తయారుచేసి అమె ఫోటోను డీపీ పెట్టి చాట్​ చేయడం మొదలు పెట్టాడు. తమ ఫోటోలను ఎందుకు డీపీ గా పెట్టావని యువతి ప్రశ్నించింది.

అతను తన వివరాలను ఏమీ చెప్పకుండా… నువ్వు ఎక్కువగా మాట్లాడితే ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్​ చేసి పెడతానని ఆమెను బెదిరించాడు. వెంటనే ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి లాగౌట్ అయింది .దీంతో ఆమె పరువు తీయాలన్న ఉద్దేశంతో ఆమె పేరిట మరో ఫేక్ ఐడి ని తయారు చేసి దానికి డిపిగా ఆమె ఫోటోతో పాటు, అశ్లీల ఫోటోలను పెట్టాడు. ఈ విషయంలో నిందితుడి పై అనుమానం వచ్చి ఆమె మామడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని అనుమానితులు అందరిపై పోలీసులు నిఘా పెట్టి దర్యాప్తు చేయగా, అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో నిందితున్ని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సోన్ సీఐ నవీన్ కుమార్ ,ఎస్సై సందీప్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed