ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ గౌష్ ఆలం

by Disha Web Desk 11 |
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ గౌష్ ఆలం
X

దిశ,ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారులతో కలిసి ఏర్పాట్లతో పాటు రూట్ మ్యాప్ ను పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా హెలిపాడ్ ,బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్ ను ప్రత్యేకంగా పరిశీలించి సిబ్బందికి ఎటువంటి భద్రతా చర్యల్లో లోపాలు లేకుండా సూచనలు చేశారు. అదేవిధంగా సోమవారం పట్టణంలోని "ఐ లవ్ ఆదిలాబాద్" ప్రాంతం నుండి, కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా మీదుగా జగ్జీవన్ చౌక్, కలెక్టర్ చౌరస్తా వరకు పూర్తిగా ఆంక్షలు ఉన్నందున శాంతినగర్ మీదుగా వినాయక్ చౌక్ రోడ్డును వినియోగించుకోవాలని సూచించారు. అటు.. రిమ్స్ ఆసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ఒకవైపు రెండు రాకపోకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక చౌక్ వరకు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లే దారి ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 వరకు పాక్షికంగా సాధారణ వాహనాలకు, ప్రజలకు అనుమతి ఉండదన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు బైక్ లు, కార్లు, ఆటోల కు పార్కింగ్ ప్రదేశాలుగా గౌతమి మోడల్ స్కూల్, వినాయక చౌక్ కాటన్ మిల్, బస్సులకు టిటిడిసి ఎదురుగా ఉన్న మైదానం, స్థానిక ఎరోడ్రం మైదానం, ఆర్టీసీ డిపో లను వాడుకోవాల్సిందిగా తెలియజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు సి సమయ్ జాన్ రావు, బి సురేందర్ రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, పి శ్రీనివాస్, ప్రకాష్, సిఐలు కే సత్యనారాయణ, ఫణిదర్, చంద్రశేఖర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ నవీన్ సిబ్బంది ఉన్నారు.



Next Story

Most Viewed