- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కంచారోని చెరువులో బోటింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు..
by Sumithra |

X
దిశ ప్రతినిధి, నిర్మల్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి, సహకారంతో కంచారోని చెరువును పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. గురువారం చెరువు ప్రాంతాన్ని సందర్శించి చెరువులో ఉన్న గుర్రపు డెక్క, చెరువు ప్రాంతాన్ని శుభ్రం చేయు ప్రక్రియ పనుల గూర్చి పరిశీలించారు. చెరువులో బోటింగ్ సిస్టమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పట్టణ వాసులకు ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా ఉదయం, సాయంకాలం సమయంలో వీక్షించేలా ఉంటుందన్నారు. ఆహ్లాదకరంగా, పచ్చని మొక్కలు, కాంతి వెలుగులతో అన్ని హంగులతో పర్యాటక ప్రదేశంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిషనర్ అరిగెల సంపత్, డీఈ నాగేశ్వరరావు, కౌన్సిలర్స్ లక్కా కుల నరహరి, తౌహీద్ ఉద్దీన్ రప్పు, తదితరులు ఉన్నారు.
Next Story