- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Technology : రిస్క్ ఎంతైనా.. రెస్క్యూలో నో ప్రాబ్లం.. ఈ వెహికల్ ఉంటే చాలు (video)

దిశ, ఫీచర్స్ : ఏవైనా వస్తువులు రవాణా చేయాలంటే మనం సాధారణంగా అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటాం. ముఖ్యంగా బస్సులు, ట్రైన్లు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటాం. ఇక పెద్ద పెద్ద కంపెనీలైతే తమ ప్రొడక్ట్స్ లేదా ఇతర సామగ్రిని దేశాల మధ్య రవాణా చేయడానికి విమానాలు, ఓడలు సైతం వినియోగిస్తాయి. అయితే కొన్ని అరుదైన, ప్రతికూల పరిస్థితుల్లో తక్కువ సామగ్రి లేదా చిన్న చిన్న అత్యవసర వస్తువులు సైతం రవాణా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిని అధిగమించేందుకు యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన బి-టెక్నాలజీ ఇంజనీర్లు ‘Scaled down flying tracked vehicle’ పేరుతో ఓ సరికొత్త వాహనాన్ని తయారు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. అదెలా పనిచేస్తుందో చూద్దాం !
అసలు ఉద్దేశం ఇదే..
యూఎస్‌కు చెందిన బి-టెక్నాలజీ నిపుణులు రూపొందించిన స్కేల్ డౌన్ ఫ్లయింగ్ ట్రాక్డ్ వాహనం ( Scaled down flying tracked vehicle) అసలు ఉద్దేశం ఏంటంటే.. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా ఉపయోగపడుతుంది. ఇది ఆకాశమార్గం ద్వారా, అలాగే రోడ్డు మార్గం ద్వారా కూడా దూసుకుపోగలదు. అంటే రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా తుఫానులు, మంచు కురిసే సమయాలు, అధిక ఉష్ణోగ్రతలు, ఎగుడూ దిగుడు నేలలు లేదా కొండలు , మంచు నేలలు, బురద నేలల్లో సైతం నావిగేషన్ చేయగల సామర్థ్యాన్ని ఫ్లయింగ్ ట్రాక్డ్ వెహికల్ కలిగి ఉందంటున్నారు నిపుణులు.
రిస్కులోనూ రెస్క్యూ..!
సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి ప్రయోజనాలను సైతం ఫ్లయింగ్ ట్రాక్డ్ వెహికల్ కలిగి ఉంటుంది. ఇది క్లిష్టమైన భూ భాగాల్లోనూ జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నావిగేట్ చేయగలదు. అట్లనే పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి(Environmental monitoring), వాతావరణ మార్పులను ట్రాక్ చేయడానికి, నష్టాన్ని అంచనా వేయడానికి యూజ్ చేయవచ్చు.
ఆపదల వేళ సహాయానికి
ఫ్లయింగ్ ట్రాక్ట్ వెహికల్ ప్రకృతి వైపరీత్యాలు(Disaster response), ఆపదల సమయంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆయా ప్రాంతాల్లో, భిన్న వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితులకు, అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వస్తువులను భూమార్గం ద్వారా అయినా, ఆకాశ మార్గం ద్వారా అయినా వేగంగా రవాణా చేయడంలో సహాయపడుతుంది.
ఏయే సెక్టార్లలో ఉపయోగం?
ఈ అధునాతన వెహికల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎరోడైనమిక్స్, రోబోటిక్స్, మెటీరియల్ సైన్స్ వంటి రంగాల్లో సరికొత్త పరిశోధనలకు పరోక్షంగా సహాయపడుతుంది. వివిధ ప్రాంతాల్లో రీసెర్చ్ చేయడానికి అవకాశాలు కల్పిస్తుంది. మరింత సమర్థవంతంగా డెవలప్ చేయగలిగితే నిర్మాణం, వ్యవసాయం, పర్యాటకం వంటి రంగాల్లో, పరిశ్రమల్లోనూ స్కేల్ - డౌన్ ఫ్లయింగ్ ట్రాక్డ్ వెహికల్స్ (Scaled down flying tracked vehicles)ను యూజ్ చేయవచ్చు.