‘అర్జున్ S/O వైజయంతి’ మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్.. నెట్టింట ఆకట్టుకుంటున్న తల్లి, కొడుకు పోస్టర్

by Hamsa |   ( Updated:2025-04-07 12:58:57.0  )
‘అర్జున్ S/O వైజయంతి’ మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్..   నెట్టింట ఆకట్టుకుంటున్న తల్లి, కొడుకు పోస్టర్
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ఓ వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజెంట్ ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటించనుంది. అలాగే సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanti) కళ్యాణ్ రామ్‌కు తల్లిగా కనిపించనుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్(Ajanish Loknath) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, శ్రీకాంత్(Srikanth) కీలక పాత్రలో నటిస్తున్నారు.

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ విడుదలవుతూ భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెకండ్ సింగిల్ ‘ముచ్చటగా బంధాలే’ ఏప్రిల్ 9వ తేదీన చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6:09 గంటలకు లాంచ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో విజయశాంతి, కళ్యాణ్ రామ్ హగ్ చేసుకుని కనిపించారు. ప్రస్తుతం తల్లి, కొడుకు పోస్టర్ నెట్టింట ఆకట్టుకుంటోంది.



Next Story

Most Viewed