రోడ్డుపై పారుతున్న మురుగు నీరు..పారిశుద్ద్యమా.. నీ జాడెక్కడ..?

by Aamani |
రోడ్డుపై పారుతున్న మురుగు నీరు..పారిశుద్ద్యమా.. నీ జాడెక్కడ..?
X

దిశ,నేరడిగొండ : నేరడిగొండ మండలం,గ్రామలో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గ్రామంలో వాడ వాడ ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయింది.వార్డులోని రోడ్లు బురద మాయమయ్యాయి. దీంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ గాడి తప్పడం తో ప్రజలు అనారోగ్యంతో సతమతమై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డ్రైనేజీ లోని నీరు పారుదల కాక ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నేరడిగొండ మండల కేంద్రంలో డ్రెయినేజీలను శుభ్రం చేయకపోవడం తో మురికి నీరు ఎక్కడికక్కడే ఆగిపోయింది.దీంతో సమీపంలో ఉన్న ప్రజలు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకొని జీవిస్తున్నారు.అంతే కాకుండా రోడ్డుకు ఇరువైపులా చెత్తా చెదారం నిల్వ ఉండటంతో దోమల సంఖ్య విపరీతంగా పెరగడం తో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మండల కేంద్రంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.పారిశుధ్య లోపం తో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.

కొన్ని చోట్ల రోడ్లపైకి మురికి నీరు వస్తున్న,అధికారులు పట్టించుకోకపోవడం వారి పనితీరు కు నిదర్శనంగా చెప్పవచ్చు.ఈ మురికి నీటి దుర్వాసన,దోమల వ్యాప్తి వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్న ..అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లిన జాడే లేదని మండల వాసులు వాసులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.కనీసం నెలకు ఒక్కసారైనా మురికి నీటి కాలువలను శుభ్రం చేయాల్సి ఉండగా అవేమి పట్టనట్టుగా ప్రత్యేక అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు మొద్దు నిద్రను వీడి డ్రెయినేజీలోని చెత్తా చెదారాన్ని తొలగించాలని మండల వాసులు కోరుతున్నారు.

పారిశుద్ధ్య లోపమే కారణమా....?

గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో పారిశుధ్య పనులు సైతం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారం, వర్షాలతో రోడ్లు అధ్వానం గా మారాయి.మురికి నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి.దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.ఇంత జరుగుతున్నా అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు.నేరడిగొండ మండలంలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.

దోమల నివారణకు చర్యలు శూన్యం....?

దోమల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వర్షాల వల్ల నేరడిగొండ మండల కేంద్రంలోని కాలనీల్లో వర్షపు నీరు నిల్వ ఉంటున్నా..బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు.గ్రామ పంచాయతీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. కొందరు ప్రత్యేక అధికారులు వారంలో ఒకసారే గ్రామ పంచాయతీ లను విజిట్ చేస్తుండటంతో పర్యవేక్షణ కరువైంది.వ్యాధుల సీజన్ కావడంతో ప్రతి గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయాల్సి ఉంది.కానీ, చాలా పంచాయతీల్లో ఈ ఫాగింగ్ పని చేయడం లేదు.దీంతో దోమల బెడద ఎక్కువగా ఉంది.అదే సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా,వైరల్ ఫీవర్ కేసులు కూడా అధికమయ్యాయి.

జ్వరాల పంజా....!

మండల వ్యాప్తంగా జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పదుల సంఖ్యలో జ్వరాల బారిన పడి అవస్థ పడుతున్నారు. జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు,కీళ్ల నొప్పులు,దగ్గు,జలుబు,సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి.ఈ జ్వరాలతో పనులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వారం రోజుల పాటు మంచనికే పరిమితం అవుతున్నారు.

సంబంధిత అధికారులు స్పందించాలి : కొప్పుల దినేష్,నేరడిగొండ

డ్రైనేజీలు చెత్తచెదరంతో నిడిపోవటంతో,నీరు పరుధాలకాక,ఎక్కడా నీరు అక్కడే నిలిచిపోయి దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది.దీంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి నీరు నిల్వ లేకుండా చూడాలి.

మండల ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు : జే లఖన్ సింగ్,దేవుల తండా

గ్రామాల్లో పారిశుధ్యం లోపించి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.దోమల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వర్షాల వల్ల మండల ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయానికి బ్లీచింగ్ పౌడర్,పాంగింగ్ చెయ్యాలి.

Advertisement

Next Story

Most Viewed