పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు

by Shiva |
పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు
X

దిశ, భీమిని : పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలైన ఘటన కన్నెపల్లి మండలంలోని జజ్జరవెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెలితే జజ్జరవెల్లి గ్రామానికి చెందిన వాసాల రాజయ్య, కొట్రంగి శ్రీనివాస్, వడూగురి రఘురాం, నికురి బురయ్య తో పాటు మరో ముగ్గురికి గాయాలు కాగా నికురే బూరయ్య చేతి వేళ్లకు తీవ్ర గాయమైంది. దీంతో వారందరిని ప్రైవేట్ వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నీకురే బూరయ్య చేతి వేలుకు తీవ్ర గాయం కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు. అనంతరం స్థానిక యువకులు పిచ్చి కుక్కను హతమార్చారు. గ్రామంలో కుక్కలు గుంపులుగా చేరి స్వైర విహారం చేస్తూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికలు కోరుతున్నారు.

Advertisement

Next Story