- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొమురం భీం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మర్తేడి గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. బెజ్జూరు మండలం నుండి బొంబాయి గుడాకు శుభకార్యానికి ఎల్లూరి లింగయ్య, దందర బాబాజీ, భుజాడి బాబాజీ, మోటార్ సైకిల్ పై వెళ్లి వస్తుండగా.. ఆదివారం అర్ధరాత్రి అదే సమయంలో ఇసుక ట్రాక్టర్ బెజ్జూర్ నుండి సులుగు పెళ్లికి వెళ్తున్న క్రమంలో మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో బెజ్జూర్ మండలం తిక్కపల్లి గ్రామానికి చెందిన చెందిన ఏల్లూరు లింగయ్య (38) సంవత్సరాలు, మహారాష్ట్రకు చెందిన దందర బాబాజీ (55) మృతి చెందగా, పాపన్నపేట గ్రామానికి చెందిన బుజాడి బాబాజీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన బాబాజీని కాగజ్నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : వెంటాడిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు స్పాట్ డెడ్