పాఠశాల బస్సును ఢీకొన్న ట్రావెల్ బస్సు

by S Gopi |
పాఠశాల బస్సును ఢీకొన్న ట్రావెల్ బస్సు
X

దిశ, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ లోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో శుక్రవారం ఉదయం పాఠశాల బస్సును ట్రావెల్ బస్సు ఢీకొంది. మండలంలోని రేపల్లెవాడ వద్ద గల సెయింట్ థెరిస్సా పాఠశాల బస్సు మాదారంలోని పాఠశాల విద్యార్థులకు తీసుకెళ్లేందుకు బస్సు వచ్చింది. విద్యార్థులను ఎక్కించుకునేందుకు పోస్టాఫీస్ వద్ద డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో వెనకాలే వస్తున్న ట్రావెల్ బస్సు ముందు ఆగి ఉన్న పాఠశాల బస్సును ఢీకొంది. దీంతో బస్సు వెనుక అద్దాలు పగిలి కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సును ట్రావెల్ బస్సు ఢీకొన్న విషయం విద్యార్థుల పేరెంట్స్ తెలుసుకుని ఆందోళన చెందారు.

Advertisement

Next Story