- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతున్నకు ఊరట.. రూ.30.70 లక్షలు విడుదల
ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ
దిశ, మంచిర్యాల: జిల్లాలో నెల రోజుల కిందట అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈదురు గాలులు, వడగళ్ల వానతో వరి, మొక్కజొన్న, మిర్చి, నువ్వు, మామిడి పంటలకు నష్టం వాటిల్లగా రైతులు ఆందోళన చెందారు. అయితే ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆశలు చిగురించాయి.
ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్టం తుది నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు పరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో జిల్లాలో పంట నష్టం వాటిల్లిన 312 మంది రైతులకు రూ.30.70 లక్షల పరిహారం అందనుంది. దీంతో ఆ రైతులకు ఊరట లభించినట్లయింది.
33 శాతం దాటిన వారికే..
గత నెలలో కురిసిన అకాల వర్షానికి దండేపల్లి, జన్నారం మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లగా, జైపూర్, భీమారం, మందమర్రి, చెన్నూరు మండలాల్లో మామిడి, మిర్చి పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. సుమారుగా 700 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తుది సర్వే చేసి రైతులను పరిహారానికి గుర్తించారు.
నిబంధనల ప్రకారం 33 శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే పరిగణన లోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఉండటంతో ఆ మేరకు తుది సర్వే ద్వారా పంట నష్టం నివేదికను తయారు చేశారు. తుది నివేదిక ద్వారా 312 మంది రైతులను పరిహారానికి అర్హులుగా గుర్తించగా వారు నష్టపోయిన 307 ఎకరాలకు గానూ రూ.30.70 లక్షల పరిహారం విడుదలైంది. గతంలో మాదిరిగా చెక్కుల రూపేనా కాకుండా నేరుగా రైతుల ఖాతాలో త్వరలో జమ అవుతాయని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొన్నారు.