పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి

by Sridhar Babu |
పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి
X

దిశ, ఆదిలాబాద్ : గత ప్రభుత్వంలో ప్రారంభించి ఇంకా పూర్తి కాని రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంపై శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని, పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

2 బీ హెచ్ కే హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సమీక్షించారు. కాగా గ్రామీణ ప్రాంతంలోని (567) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ఖరారు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని 2 బీహెచ్ కే ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం రూ. 3.40 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈఈపీఆర్ మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలను సమర్పించాలని, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ నుండి ప్రతిపాదనలు అందిన వెంటనే అడ్మిస్ట్రేటివ్ అనుమతి ఇస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed