- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని రాక కోసం అధికారికంగా పూర్తి ఏర్పాట్లు
దిశ, ఆదిలాబాద్: పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తెలిపారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జిల్లాకేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి... స్థానిక పెన్‌గంగా భవన్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు ఆరు వేల కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నట్టు వెల్లడించారు. ముందుగా సోమవారం ఉదయం 10 గంటలకు మోదీ ఆదిలాబాద్‌కు చేరుకుంటారన్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేంద్రమంత్రులు విచ్చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా పీఎం, సీఎం, కేంద్ర మంత్రుల ల్యాండింగ్ కోసం హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేయడంపై జిల్లా యంత్రాంగాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
అధికారిక కార్యక్రమాల ముగిసిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి వెళ్లిపోతారని, తాను పీఎం వెళ్లేంతవరకూ ఇక్కడే ఉండి ఆయనకు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఘనంగా వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేథన్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పీఎం, సీఎం రానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.