అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలి : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

by Aamani |
అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలి : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
X

దిశ, ఆసిఫాబాద్ : భీం వర్ధంతి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కెరమెరి మండలంలోని జోడేన్ ఘాట్ లో భీం వర్ధంతి వేడుకల్లో విధులు నిర్వహించనున్న పోలీస్ సిబ్బందికి జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, డీఎస్పీ కరుణాకర్ తో బ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వర్థంతికి రాష్ట్ర మంత్రి సీతక్క తో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్, వీఐపీ పార్కింగ్, హెలిప్యాడ్, ఇతర ప్రాంతాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. వారి వారికి కేటాయించిన ప్రదేశాల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు. భీం వర్ధంతికి ఒక జిల్లా అదనపు ఎస్పీ స్థాయి అధికారితో పాటు ముగ్గురు డీఎస్పీలు 15 సీఐలు, 28 మంది ఎస్సైలు 460 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు, ఇందులో జిల్లా పోలీసులతో పాటు రామగుండం కమిషనరేట్, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల జిల్లాల నుంచి వచ్చారని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed