- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల ఆరోగ్యం కోసం మరిన్ని జాగ్రత్తలుః ఎమ్మెల్యే బొజ్జు పటేల్
దిశ, కడం : పేదల ఆరోగ్యం కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిరు పేద కుటుంబాలకు ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తోందని, పేషంట్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. బుధవారం నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు 330,000లక్షల విలువలు గల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనిపేర్కొన్నారు.సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటితో పాటు ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలలో మొక్కలను నాటాలన్నారు. చెట్లను పెంచితేనే మానవ మనుగడ సాఫీగా సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.