- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బాసర విద్యార్ధులకు హాట్సాఫ్.. దెబ్బకు కేటీఆర్ దిగి వచ్చాడు'
దిశ, ముధోల్: బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు హ్యాట్సాఫ్.. వారికి ఉద్యమ స్ఫూర్తి బాగుందని, దెబ్బకు కేటీఆర్ దిగివచ్చాడని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఐదో విడత ప్రజాసంగ్రామ భైంసా బహిరంగ సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ తన చెప్పుచేతల్లో ఉండే పోలీసులతో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభను అడ్డుకోవాలని చూసాడని, అయిన బహిరంగ సభకు కోర్టు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంత పెద్ద పార్టీ బహిరంగ సభ 2 గంటలే ఉంటుందా.. ఇది బాధాకరమని అన్నారు.
కేసీఆర్ పాలనలో చదువులమ్మ ఒడి అయిన బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని చేశారని అన్నారు. విద్యార్థుల ఉద్యమంతో కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగి వచ్చావని, రాష్ట్రా రెసిడెన్షియల్ పాఠశాలలో మంచి భోజనం పెట్టకపోవడం, బల్లులు పడ్డ అన్నం తిని, విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారని, కేసీఆర్‌ను ఓడగొట్టడమే తమ ఎజెండా అని ప్రజలు అనుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం గుమ్మం కూడా దాటవని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డైరెక్షన్‌లో పోలీసులు ఎంత మంది బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. రాబోయే కాలంలో పులి బిడ్డల్లా ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని కోరారు.
- Tags
- Etela Rajender