- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేయడం నా ప్రధాన లక్ష్యం..
దిశ, చెన్నూర్ : నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వవిప్ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని ఎనిమిది హెల్త్ సబ్ సెంటర్లకు 1.60 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతాలలోని వైద్య సేవలు మెరుగుపరచాలని ఉద్దేశంతో నియోజకవర్గంలోని అంగ్రాజుపల్లి, సోమన్ పల్లి, కుందారం, శెట్పల్లి, పిన్నారం ఇందారం, ఆల్గావ్, కత్తెరశాల గ్రామాలలోని సబ్ సెంటర్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రతిభవనానికి 20 లక్షల చొప్పున మొత్తం 1.60 కోట్లు రూపాయల నిధులతో గ్రామీణ ప్రాంతాలోని సబ్ సెంటర్లలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
వైద్య సేవల కోసం ఎవరు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు దవాఖానాలకు వెళ్లకుండా అత్యంత ఆధునిక వసతులతో ఈ హెల్త్ సబ్ సెంటర్లను ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా తయారు చేస్తామని తెలిపారు. గడచిన 60 ఏళ్లలో గతపాలకులు ఎవరూ చెన్నూరు నియోజకవర్గంలో విద్య, వైద్యం, రవాణా, మౌలిక వసతులను కల్పించడంలో విఫలమైనారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సుమారు 40 కోట్ల పైచిలుకు నిధులతో పట్టణంలో నిర్మించనున్న వంద పడకల దవాఖానకు త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 8 హెల్త్ సబ్ సెంటర్లకు నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్లనియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.