- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాసర RGUKT స్నాతకోత్సవంలో మంత్రి KTR..
దిశ ప్రతినిధి నిర్మల్/బాసర: పెరుగుతున్న సాంకేతిక పరిణామాల నేపథ్యంలో ఇక ప్రపంచం త్రీ- డి వైపు దూసుకెళుతున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 550 మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలను పొందారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో కేటీఆర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో సాంకేతికత విపరీతంగా విస్తరించిందని. అలాంటి పనిలో తెలంగాణకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాలుపంచుకుంటూ ఉండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో బాసర ట్రిపుల్ ఐటి పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రపంచం ఇప్పుడు 3d వైపు మల్లుతున్నదని వచ్చే 20 సంవత్సరాల్లో ఈ విధానం ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పారు. డిజిటైజేషన్, డి కార్బొనైజేషన్, డిసెంట్రలైజేషన్.. త్రీ - డి విధానంతో భవిష్యత్తు అంతా వీటి చుట్టే తిరుగుతుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందని చెప్పారు.
ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు సాంకేతికతను అందుకోవడంలో మరింత చురుగ్గా ముందుకు సాగాలని తద్వారా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పారు. విద్యాలయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని చెప్పారు. తాము గతంలో చెప్పిన విధంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలో 2200 లాప్టాప్ లు అందిస్తున్నామని చెప్పారు. 850 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం నిర్మించడంపై వైస్ ఛాన్స్లర్ను కేటీఆర్ అభినందించారు. త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మెస్సు సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మెస్సు నిర్వాహకులను వెంటనే మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అభివృద్ధి బాల్క సుమన్ కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఎమ్మెల్సీ దండే విట్టల్ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఎస్పీ చల్ల ప్రవీణ్ కుమార్ వైస్ ఛాన్స్లర్ వెంకటరమణ డైరెక్టర్ సతీష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.