- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపు అసిఫాబాద్ లో మెగా జాబ్ మేళ

దిశ, తాండూర్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 40కు పైగా ప్రైవేట్ కంపెనీల్లో 3,500 పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. హ్యాపీ మొబైల్స్, హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు, ఎస్.బీ.ఐ కార్డ్స్, అపోలో ఫార్మసీ, డీమార్ట్, రిలయన్స్ జియో మార్ట్, ముత్తూట్ గ్రూప్ తదితర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు జిల్లా కేంద్రంలో కోర్టు ఎదురుగా గల జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో సకాలంలో హాజరు కావాలని సూచించారు. జాబ్ మేళాకు విద్యార్హత ధ్రువ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తీసుకొని హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.