- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైద్య సిబ్బందిని నియమిస్తాం
దిశ, ఉట్నూర్ : ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను నియమించి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ పై మీటింగ్ నిర్వహించారు. ముందుగా రోగులకు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సమస్యలను వైద్యులతో, సిబ్బందితో చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఉపేందర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దాంతో త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చెపడాతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో టీ-హాబ్ ను ఏర్పాటు చేసిందని, త్వరలోనే డయాలసిస్ రోగులకు మరిన్ని మిషన్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ కి కుమ్రం భీం జిల్లా లింగాపూర్ మండలం దంపూర్ గ్రామ ప్రజలు చాలా మంది వైద్యం కోసం ఉట్నూర్ కి వస్తున్నారని తెలుసుకోవడంతో అక్కడి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డీఎంఎచ్ఓ తో మాట్లాడారు. వెంటనే ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.మహేందర్, డా. కపిల్ తదితరులు ఉన్నారు.