- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి..
దిశ, మందమర్రి : మహిళలు అన్ని రంగాలలో ఎదగాలని మందమర్రి సింగరేణి సేవాసమితి అధ్యక్షురాలు చింతల లక్ష్మి అన్నారు. శుక్రవారం భారత్ కి ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇల్లందు క్లబ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ స్త్రీలు భర్త పై ఆధారపడి జీవించడం వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వివాహమైన స్త్రీలు చేతివృత్తులపై దృష్టి సారిస్తే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించవచ్చుని స్పష్టం చేశారు.
పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు ఉన్నాయని ఆ హక్కులను అమలు చేసుకోవలసిన అవసరం మనకు ఉందని అన్నారు. అనంతరం త్రో బాల్, బాంబిన్ బ్లాస్ట్, గ్రూప్ డాన్సులు, పాటల పోటీలని ప్రారంభించారు. పోటీలలో గెలుపొందిన వారికి మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఓ మైత్రేయ బందు, మహిళ క్లబ్ సభ్యులు నిమ్మిజాన్ ఆనంద్, సుజాత శ్యాంసుందర్, సుమ, గ్రౌండ్ ఇంచార్జి నస్పూరి తిరుపతి, కమ్యూనికేషన్, సేవాసమితి కోఆర్డినేటర్ ఏం.నెల్సన్, తుమ్మల సంపత్ తదితర సేవసభ్యులు పాల్గొన్నారు.