- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఇబ్బందులు గమనించండి..కనీసం ఆ పనైనా చేయండి..
దిశ, లోకేశ్వరం: చెడిపోయిన రోడ్లకు శాశ్వత నిర్మాణం చేపట్టకపోయినా, కనీసం మరమ్మతులైన చేపట్టాలని మండల సమావేశంలో సభ్యులు అధికారులను కోరారు. మంగళవారం మండల పరిషత్ అధ్యక్షురాలు లలిత- భోజన్న అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు మండలంలోని రోడ్ల దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టి ఏళ్ళు గడుస్తుండటంతో మండలంలోని దాదాపు అన్ని రోడ్లు పూర్తిగా చెడిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీలైనంత త్వరలో కనీసం మరమ్మతులైన చేపట్టాలని వారు కోరారు.
ముఖ్యంగా లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామం వద్ద నిజామాబాద్ జిల్లాను అనుసంధానించేందుకు చేపట్టిన రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని ఆ రోడ్డుపై కేవలం ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే 30 నిమిషాలకు పైగా సమయం పడుతుందని అన్నారు. అలాగే వాహనాలు చెడిపోతున్నాయని అధికారులు వీలైనంత త్వరలో పనులు వేగవంతం అయ్యేలా చూడాలని మండల పరిషత్ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి ఆర్ అండ్ బీ అధికారులను కోరారు. ప్రభుత్వం నుండి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడని అందుకే పనుల్లో జాప్యం జరుగుతుందని సంబంధిత అధికారి సమాధానం ఇచ్చారు.
అలాగే ఈ సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ మాట్లాడుతూ రైతు బీమా కలిగి ఉండి మరణించిన రైతులందరికీ బీమా డబ్బులు జమ చేశామని తెలిపారు. అలాగే మండలంలోని పలువురు రైతులు ఈ కేవైసీ చేసుకోక పోవడంతో వారి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ కావడం లేదని , ప్రజా ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. అలాగే మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు భుజంగరావు మాట్లాడుతూ ఈసారి బతుకమ్మ చీరల పంపిణీ సక్రమంగా జరగలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షులు రత్నాకర్ రావు , వివిధ శాఖల అధికారులు సర్పంచులు సభ్యులు పాల్గొన్నారు.