- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమస్యల వలయంలో "సఖి" కేంద్రం..
దిశ, మంచిర్యాల టౌన్ : ఆపదలో ఉన్న మహిళలను అన్నివిధాలా ఆదుకొని, గృహహింస వేధింపులు, దాడులకు గురైన మహిళలకు తక్షణ వైద్య సదుపాయంతో పాటు న్యాయ, ఆర్థిక సాయం అందించే దిశగా సఖి కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో కొనసాగే ఈ సఖి కేంద్రాలను తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రారంభించింది. నాటి నుండి కొన్ని ప్రభుత్వ ఆధీనంలో నడువగ మరికొన్ని ఎన్జీఓల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సఖినిర్వహణ కొనసాగుతుంది. మంచిర్యాలలో సఖిసెంటర్ 2019 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రారంభంలో సఖి నిర్వహణ అంత ప్రైవేట్ ఎన్జీఓ చేతిలోనే ఉండి అద్దె భవనంలో నిర్వహించేవారు. గతంలోనూ సఖికేంద్రంలో పలు అక్రమాలు జరిగి, అప్పటి డీడబ్లుఓ సైతం పలు విమర్శలు ఎదుర్కొన్నారు.
అనంతరం కొత్త ఎన్జీఓ బాధ్యతలను చేపట్టి, గత ఏడాది 2022 జనవరిలో నూతన బిల్డింగ్ లోకి షిఫ్ట్ అయినప్పటికి సమస్యలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికీ సరిఅయిన స్టాఫ్ లేక సిబ్బంది నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ కేస్ వస్తె లోపలికి తీసుకొచ్చే సిబ్బంది లేకపోవడంతో తోటి వారే వారిని లోపలికి తీసుకొచ్చి చేరుస్తున పరిస్థితులు ఉన్నాయి. రాత్రి వేళల్లో నిత్యం గోదావరి రోడ్ అంత రద్దీగా ఉండి తాగుబోతుల వీర విహారం నిత్యం జరుగుతుంది. ఇటీవల బయట మధ్య తాగిన యువకులు కొందరు గొడవ పడుతూ కేంద్రం లోపలికి చోరబడిన సంఘటనలు ఉన్నాయి.
సరి అయిన సెక్యూరిటీ లేకపోవడంతోనే ఇలా జరుగుతుందని సమస్యలు విన్నవించెందుకు జిల్లా కలెక్టర్ ని కలవాలని పలుసార్లు ప్రయత్నించినప్పటికీ సార్ ఎపుడు మాకు సమయం ఇవ్వకుండా దాటేస్తున్నాడు అని ఇటీవల కలెక్టర్ సీసీకి ఫోన్ చేసి సఖిలో సమస్యల పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని సఖి నిర్వాహకురాలు అతన్ని కోరగా, మికేం పని లేదా ఎందుకు మమల్ని ఎప్పటికీ డిస్టర్బ్ చేస్తున్నారు. మాకు మీ ఒక్కటే కాకుండా చాలా పనులు ఉన్నాయని దురుసుగా మాట్లాడడంతో మళ్ళీ తిరిగి కలెక్టర్ నీ కలిసే ప్రయత్నం చేయలేదని చెప్తున్నారు. ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలోని సఖిసెంటర్ ను స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ లు నిత్యం ఎపుడో ఒకసారి సందర్శించి వాటిలో ఉన్న సమస్యల గురించి చర్చించిన సందర్భాలు ఉన్నపటికీ మంచిర్యాల కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన అప్పటి నుండి ఇప్పటి వరకు సఖి కేంద్రం వైపు చుడాక పోవడం విడ్డూరం.
ఒక వైపు సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో పాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళల హెల్ప్ లైన్ నంబర్ 181 కు కాల్ చేస్తే మంచిర్యాల సఖిసెంటర్ కు కాల్ ను కనెక్ట్ చేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన ల్యాండ్ లైన్ ఫోన్ గత మూడు నెలల నుండి పని చేయడం లేదు, బిల్లు కట్టక పోవడంతో కనెక్షన్ తిసేసినట్టు సమాచారం. అంతే కాకుండా నిత్యం పలు సమస్యలతో వచ్చే మహిళలు ఇక్కడనే ఒక రెండు రోజులు ఉండే విధంగా ఏర్పాట్లు ఉన్నపటికీ సరి అయిన సెక్యూరిటీ, నీటి సదుపాయం పూర్తిగా లేకపోవడంతో వాళ్ళు తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కనీసం కేంద్రాన్ని శుభ్రం చేసేందుకు క్లీనింగ్ స్టాఫ్ సైతం లేక పోవడంతో ఉన్న సిబ్బందే క్లీన్ చేసుకొని ఉంటున్నారని అక్కడి సిబ్బంది తెలిపారు. సఖికేంద్రంలో మెడికల్ స్టాఫ్ ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒకరు మత్రమే ఉన్నారు. అది కూడా ఆమె నైట్ డ్యూటీనే చేస్తుంది. వాటితో పాటు డ్రైనేజీ సమస్య పెద్ద ఎత్తున ఏర్పడి వాసన వస్తుంది. చాలా సమస్యలు సఖి కేంద్రంలో ఉన్నాయని పలుసార్లు నిర్వహకులు డిడబ్లుఓకి విన్నవించినప్పటికీ అయిన సమస్యల విషయంలో పట్టి పట్టనట్టు ఉంటున్నారని, పలుసార్లు కలెక్టర్ ను అయిన కలిసి సమస్యలు విన్నవించెందుకు ప్రయత్నించినప్పటికి ఆయన కూడా మాకు సమయం ఇవ్వడం లేదు అని వారు వాపోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం మంచిర్యాల సఖికేంద్రం ఇన్ని రోజులు ఆదిలాబాద్ లోని ఎన్జీఓ సంస్థకి చెందిన ఝాన్సి అనే నిర్వాహకురాలు చేతిలో ఉండగా ఆమె సైతం ఇటీవల రాజీనామా చేసినట్లు, రాజీనామా విషయాన్ని డీడబ్ల్యూ ఓకీ కానీ, కమిషనర్ కు గానీ తెలియజేయలేదు అని సమాచారం. ప్రస్తుతానికి మంచిర్యాల సఖి కేంద్రం నిర్వహణ మాత్రం అధికారులు, ఎన్జీఓలు కలిసి గాలికి వదిలేసినట్లు తెలుస్తుంది. ఇపుడు ఎన్జీఓ రాజీనామాతో మంచిర్యాల సఖికేంద్రం తిరిగి ఎన్జీఓ చేతిలోకి వెళ్తుందా లేక ప్రభుత్వం అధీనంలోకి వెళ్తుందా అనేది వేచిచూడాల్సి ఉంది.
అజ్మీర్ శ్రీలత.. సఖి కేంద్రం నిర్వాహకురాలు..
ఎన్జీఓ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖికేంద్రాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. పలుసార్లు సమస్యలు ఉన్నాయని డిడబ్లుఓకు విన్నవుంచునప్పటికి అయిన పట్టించుకోలేదు, కలెక్టర్ ను కలవడానికి ప్రయత్నించిన, సర్ మాకు సమయం ఇస్థలేరు, రాత్రి సెక్యూరిటీ, సరి అయిన సిబ్బంది, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.