- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నుల పండుగగా సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన..
దిశ, తానూర్ : తానూర్ మండల కేంద్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం గ్రామస్థులు సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళలు బాజా భజంత్రీలతో మహిళలు మంగళ హారతులతో విట్టలేశ్వర ఆలయం నుంచి శోభాయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సచిన్ పటాక్ ఆధ్వర్యంలో సాయిబాబాకి నూతన వస్త్రాలు, పూలమాలలు సమర్పించి అభిషేకం, పూజ, హోమం, కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సాయబాబా విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని తానూర్ మండల కేంద్రంలో పుట్టింటి ఆడపడుచులు, భందువులు రావడంతో తానూర్ సందడిగా మారింది.
ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది గ్రామ కమిటీ, ఆలయ కమిటీ అధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మేల్లే విఠల్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాషెట్టీ రాజన్న, ఆత్మ చెర్మేన్ పోతరెడ్డీ, బీఆర్ఎస్ నాయకులు చంద్రకాంత్, గ్రామ సర్పంచ్ తాడేవార్ విఠల్, ఎంపీటీసీ సుగంధ మాధవ్ రావు పాటిల్, ఆలయా కమిటీ అధ్యక్షులు పంగి పండరి, ఉపాధ్యక్షులు డి.రాములు కార్యదర్శి గోవింద్ పాటిల్, గ్రామ పెద్దలు అరుణ్ దేశ్ పాండే, శివాజీ పాటిల్, సోమనాథ్, జి.పోషెట్టి, ఆర్.భుమన్న, కే.పండరి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.