మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇంతే..

by Sumithra |   ( Updated:2022-10-06 08:46:23.0  )
మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇంతే..
X

దిశ, నేరడిగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు యాటికర్ల పెద్దులు అన్నారు. వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 74 వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి వీఆర్ఏలకు వేతనాలు లేక దసరా పండగను సరిగ్గా జరుపుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏల న్యాయ పరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన హామీ మేరకు అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించడంతో పాటు పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సంటన్న, వీఆర్ఏలు ఎండీ రఫీ రాజేందర్, ఇబ్రహీం, ఇస్మాయిల్ లస్మన్న, సంధ్య, సయ్యద్ షకీల్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed