ఒక్క చెయ్యితోనే కుస్తీపోటీ...

by Sumithra |
ఒక్క చెయ్యితోనే కుస్తీపోటీ...
X

దిశ, కుబీర్ : కుబీర్ మండల కేంద్రంలో బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రతిఏటా ఉగాది పర్వదినం రోజున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మల్లయోధులు మహారాష్ట్ర, విదర్భ, తదితర ప్రాంతాల నుంచి వచ్చి అధిక సంఖ్యలో పోటీలో పాల్గొన్నారు.

మహారాష్ట్రలోని కరికేల్లి ప్రాంతానికి చెందిన గణేష్ ఒక్క చేతితోని కుస్తీ పోటీలో పాల్గొన్నాడు. ఇతని కుస్తీ పోటీని చూసి ప్రేక్షకులు ఆసక్తితో చూసికేరింతలు కొట్టరు. నిర్వాహకులే కాకుండా ఇతనికి ప్రేక్షకులు సైతం నగదును బహుకరించారు. మొదటి బహుమతిగా నాందేడ్ కు చెందిన యోగేష్ కు 5,000 రూపాయలు బహుకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు నార పరుశురాం కమిటీ సభ్యులు అన్నిఏర్పాట్లను సక్రమంగా చేశారు. పోలీసుల పర్యవేక్షణలో పోటీలు సజావుగా నిర్వహించారు.

Advertisement

Next Story