SP : జిల్లాలో 30 యాక్ట్ అమలు ప్రతి ఒక్కరూ పాటించాలి...

by Kavitha |
SP : జిల్లాలో 30 యాక్ట్ అమలు ప్రతి ఒక్కరూ పాటించాలి...
X

దిశ, భైంసా : సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసా పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడుతూ... కుబీర్ మండలానికి చెందిన ఒక అమ్మాయి, అబ్బాయికి సంబంధించిన చిన్న ఇష్యూ బుధవారం చోటు చేసుకోగా,ఈ గొడవను దీర్ఘ దృష్టితో చూడొద్దని అన్నారు. ఇప్పటికే ఇష్యూ కు సంబంధించిన వివరాలను వెరిఫై చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని అన్నారు. జిల్లాలోని ప్రజలు 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరూ కూడా దీనిని ఉల్లంఘించే పనులు చేయొద్దని సూచించారు. ఆమె వెంట పట్టణ టౌన్ ఎస్.హెచ్.ఓ జి.గోపీనాథ్, పోలీసులు ఉన్నారు.

Next Story

Most Viewed