చెరువులను కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

by Sumithra |
చెరువులను కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
X

దిశ, జన్నారం : చెరువులను కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మాదాడి సరోజన అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ఇరిగేషన్ డి.ఈ వెంకటేశ్వర్ నివేదికను చదివి వినిపిస్తుండగా ఇరిగేషన్ భూములు, మండలంలోని పలు చెరువులు కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వైస్ఎంపీపీ సుతారి వినయ్, కో ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీఖాన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఇరిగేషన్ భూములు, చెరువులు కబ్జా చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారికి నోటీసులు అందచేసి 15 రోజుల్లో కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ సీడీపీవో రేష్మ అంగన్వాడీలలో 6 టీచర్స్, 10 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. విద్యుత్ శాఖ ఏ.ఈ మాట్లాడుతుండగా వైస్ ఎంపీపీ సుతారి వినయ్, రేండ్లగూడ ఎంపీటీసీ దాముక మమతకరుణాకర్ లు కరెంట్ కోతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇష్టారీతిలో కరెంట్ కట్ చేయడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఏఈ స్థానికంగా ఉండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మాట్లాడుతూ స్థానికంగా ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండే విద్యుత్ కోతలు లేకుండా చూడాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఆసుపత్రిలో ఉండడం లేదని ఆసుపత్రిలో డెలివరీలు చేయడం లేదని గర్బినులను లక్షేటిపేట, జగిత్యాలకు రేఫర్ చేస్తుందని ఎంపీటీసీలు ఈ సందర్బంగా అన్నారు. బొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నష్టపోయిన తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర చంద్ర శేఖర్, ఎంపీడీఓ శశికళ, ఎమ్మార్వో రాజమనోహర్ రెడ్డి, ఎంపీటీసీలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story