- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మకేది ఆర్ధిక సాయం..కిట్లతో సరిపెడుతున్న వైనం..
దిశ, మంచిర్యాల టౌన్ : కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఘనంగా గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ కిట్ల పథకం పరిస్థితి అధ్వానంగా మారింది. రాష్ట్రంలో కేసీఆర్ కిట్ పథకం కింద ఇచ్చే నగదుసాయం కోసం సంవత్సరాలు, నెలలు తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో లబ్దిదారులు నగదు ప్రోత్సహకమ్ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి చెల్లించాల్సిన బకాయిలు కోట్లలో పేరుకు పోయాయి. సర్కారు వద్ద సొమ్ము లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది అని వైద్యశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సీఎం కేసీఆర్ పేరుతో నడుస్తున్న పథకం పరిస్థితే ఇలా ఉంటె మిగిలిన పథకాల సంగతి ఏంటో అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం కావాలి అనే ఉదేశ్యంతో 2017 జూన్ లో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా కేసీఆర్ సర్కార్, కేసీఆర్ కిట్ అనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో తల్లి పిల్లలకు అవసరం అయిన 15 రకాల వస్తువులు ఇవ్వడంతో పాటు ఆడపిల్ల పుడితే రూ 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలు నాలుగు విడతలు గ జమ చేసేవారు . గర్భం దాల్చిన వెంటనే కేసీఆర్ కిట్ పోర్టల్ లో గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు నమోదు చేసి మొదటి విడతగా రూ .3 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. కాన్పు అయ్యాక పుట్టింది పాపా అయితే రూ 5 వేలు, బాబు అయితే రూ 4 వేలు జమ చేసేవారు. బిడ్డకు నాలుగవ టీకా వేయించిన తరువాత మరో రూ.3 వేలు, 9 వ నెల వచ్చిన తరువాత మిగిలిన సొమ్మును వారి ఖాతాలో జమచేసేవారు.
దీనితో అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రిలు కిటకిట లాడాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కానీ గత రెండేళ్లుగ పరిస్థితి మారింది రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ సమయంలో కిట్ ను మాత్రమే అందిస్తున్నారు తప్ప నగదు ప్రోత్సహకాన్ని మాత్రం ఇవ్వట్లేదు. చాల మంది తల్లులు ఇపుడు డబ్బుల కోసం ఎదురు చుస్తున్నారు. కేసీఆర్ కిట్ నిలిపివేత ప్రభావం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నా ఆరోగ్య కార్యకర్తల పైనే పడుతుంది. కేసీఆర్ కిట్ నమోదు బాధ్యతలు అన్ని ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు చూసుకుంటారు. గర్భిణీల వివరాలన్నీ వీరే పోర్టల్ లో నమోదు చేస్తారు. డబ్బులు రాక పోవడంతో గర్భిణుల కుటుంబ సభ్యులు ఆరోగ్య సిబ్బందిని నిలదీస్తున్నారు. మరి కొందరు అయితే మాకు రావాల్సిన డబ్బును మిరే స్వాహా చేశారని, కావాలనే మీరు మాకు డబ్బులు ఇవ్వడం లేదు అని వారి పై దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో 2021 సంవత్సరానికి గాను 20610 మంది గర్భిణీ స్త్రీలు కేసీఆర్ కిట్ కు అర్హులు కాగా కేవలం 5912 మందికే నగదు ప్రోత్సహకం అందింది. మిగిలిన 14,509 మందికి నగదు ప్రోత్సహకం అందకపోవడంతో కిట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో దాదాపు 189 మంది గర్భిణీల లెక్కలు ఆన్లైన్ లో సరిగా నమోదు కాకపోవడంతో వారిని అనర్హులుగా ప్రకటించారు. 2022 సంవత్సరానికిగాను 21,044 మంది గర్భిణీ స్త్రీలు కేసీఆర్ కిట్టుకు అర్హులు కాగా ఇప్పటికి ఏ ఒక్కరికి నగదు ప్రోస్తాహకం అందలేదు. కేవలం కిట్టు మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు.