- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైరి నరేష్ కు ప్రభుత్వం రక్షణ కల్పించాలి : ఒజ్జ రమేష్
దిశ, మందమర్రి : బైరి నరేష్ పై పోలీసుల సమక్షంలో మతోన్మాదులు చేసిన దాడి అప్రజా స్వామికమని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, పౌర సంఘాల స్వేచ్ఛ (జేఏసీ) కన్వీనర్ ఒజ్జ రమేష్ ఖండించారు. నాస్తిక వాది బైరి రమేష్ దాడికి నిరసనగా గురువారం దిశ పత్రికకు ఒక సుదీర్ఘ ప్రకటనను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైరి నరేష్ కానీ, ఇంకొకరు కానీ, ఎవరు మాట్లాడిన మాటలైన చట్ట వ్యతిరేకంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని అడ్డం పెట్టుకొని, అల్లర్లు సృష్టించి, మారణకాండతో అధికారంలోకి రావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడనే ఈ మతోన్మాదం మూకదాడుల స్పష్టం చేశారు.
ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వ్యవహరించిన విధంగానే తెలంగాణలో అల్లర్లు, గొడవలు రేపి మూకదాడులు, మారనకాండలతో బాజాప అధికారంలోకి రావడానికి కుయుక్తులు రచిస్తుందని చెప్పారు. కొంతమందిని ముఠాగా ఏర్పాటుచేసి క్రూరమైన రాజకీయ దురాశ ఆలోచనలతో ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారు. వీటిని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య రక్షణ నేడు ప్రజల బాధ్యతగా మారిందిని వివరించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనువాద కులాధిపత్యం మగాధిపత్య రాజ్యాన్ని నెలకొల్పాలని భావిస్తున్న ఉన్మాద శక్తులకు తోడ్పడే విధంగా హేతువాదులు, నాస్తికులు, భౌతికవాదులు, అంబేద్కర్ వాదులు వ్యవహరించకుండా అత్యంత జాగ్రత్త తో మాట్లాడాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ఘటన పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే మతోన్మాదులను సమర్ధించినట్లే అవుతుందని అన్నారు. ప్రజా ఉద్యమాలను నిరంకుశంగా అణిచివేసే ప్రభుత్వం, పోలీసులు తమ ఆధీనంలో, తమ వాహనంలో ఉన్న వ్యక్తికి రక్షణ కల్పించ లేకపోతే ఇక రాష్ట్రాన్నేం కాపాడుతారని ప్రశ్నించారు. ప్రయాణంలో ఉన్నపోలీస్ వాహనాన్ని పట్టుమని పదిమంది కూడా లేని గుంపు ఆపి, అంతసేపు కొట్టటం, బట్టలు తొలగించటం జరుగుతున్నా పోలీసులు లాఠీ కూడా ఉపయోగించకుండా కాలయాపన చేయటం విస్మయానికి గురి చేస్తున్నదని వాపోయారు.
తమ రక్షణలో ఉన్న వ్యక్తిని ఒక నేరస్త గుంపునకు అప్పగించిన పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భాధ్యత వహించాలని అన్నారు. వికారాబాద్ జిల్లాలో కూడా మతోన్మాద మూకలు ఈ విధంగానే దళిత యువకుడి పై పోలీస్ స్టేషన్లోనే దాడి చేసి కొట్టారని గుర్తు చేశారు. పోలీసులు నిస్సహాయులుగా మిగిలితే ఇక రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఇక ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలో మిగిలేది అరాచకం, ఉన్మాదమేనని జోష్యం చెప్పారు.
ఎన్నో పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను ఈ మతోన్మాద ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక మూకలకు బలి చేయరాదని స్పష్టం చేశారు. అలాగే బైరి నరేష్ మాట్లాడిన ధోరణి పట్ల స్వేచ్ఛ జేఏసీకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆ ధోరణిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బైరి నరేష్ పై మతోన్మాద మూక దాడులకు పాల్పడిన అరాచక వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని స్వేచ్ఛ జేఏసీ డిమాండ్ చేస్తున్నదని చెప్పారు. భవిష్యత్తులో మరొకరు ఇలా అరాచకంగా మూకదాడులకు పాల్పడకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
బైరి నరేష్ కు మిగతా నాస్తికులకు, అంబేద్కర్ వాదులకు, హేతువాదులకు, భౌతిక వాదులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని అన్నారు. మతాన్ని నమ్మడం నమ్మకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దేవుళ్లను మొక్కడం ఎంత హక్కో, నిరూపణకు నిలబడని దేవుళ్ళను విమర్శించడం అంతే హక్కుని అన్నారు. మతాల పట్ల, దేవుళ్ళ పట్ల విశ్వాసం లేకపోవడం చార్వాకులు, లోకాయతులు, బుద్ధుడు వేమన, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ల భారతీయ చారిత్రక వారసత్వని స్పష్టం చేశారు. వీటిని పరిరక్షించి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఒజ్జ రమేష్ వివరించారు.