సరస్వతి దేవి అలంకరణలో దుర్గామాత

by Sumithra |
సరస్వతి దేవి అలంకరణలో దుర్గామాత
X

దిశ, బెజ్జుర్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని రంగనాయక దేవాలయం ప్రాంగణంలో కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఆదివారం ఏడవ రోజు కావడంతో దుర్గామాత సరస్వతి దేవి అలంకరణతో భక్తులను ఆకట్టుకుంది. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెజ్జూరు గ్రామానికి చెందిన రాచకొండ చంద్రశేఖర్, తంగడపల్లి మహేష్, రాచకొండ నగేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed