- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోడకు కన్నం వేసి బ్యాంక్ లో చొరబడ్డ దొంగలు..
దిశ, చింతలమానేపల్లి : మండలంలోని రవీంద్రనగర్ గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి విఫలయత్నం చెందారు. శుక్రవారం ఉదయం బ్యాంక్ ఉద్యోగులు ప్రతిరోజూ లాగే తమ విధఉలకు హాజరయ్యారు. బ్యాంక్ గేట్లు తెరచి లోపలికి వెళ్లగానే గోడకు కన్నం ఉండడం, వస్తువులు చిందర వందరగా ఉండడడం గమనించారు. అది చూసిన బ్యాంక్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి ప్రయత్నించిన తీరు, అక్కడ పరిస్థితులను ఆరా తీశారు.
గోడకు కన్నం వేసి నేరుగా బ్యాంక్ లోకి చొరబడ్డ నిందితులు లాకర్ ను ఓపెన్ చేసేందుకు గ్యాస్ కట్టర్ ను ఉపయోగించారని తెలిపారు. అయినా లాకర్ ఓపెన్ కాకపోవడంతో విఫలం చెంది బ్యాంక్ లో ఉన్న సీసీ కేమేరాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ కరుణాకర్, సీఐ బుద్దెస్వామీ, ఎస్సైలు విజయ్, రమేష్ తదితరులు ఉన్నారు.