- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా తరలిస్తున్న దేశిదారు పట్టివేత..
దిశ, కాగజ్ నగర్ : మహారాష్ట్ర నుండి కాగజ్ నగర్ కు అక్రమంగా తరలిస్తున్న దేశిదారు మద్యాన్ని మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు కాగజ్ నగర్ పెద్దవాగు సమీపంలోని మైసమ్మగుడి వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా మహారాష్ట్ర నుండి కాగజ్ నగర్ కు రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 30 దేశిదారు మద్యం కాటన్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
ఎంఎచ్ 04 bw 611 శాంట్రో, ఎంహెచ్ 49 బీబీ 5818 టయోటా కారులో నలుగురు వ్యక్తులు కలిసి మద్యాన్ని కాగజ్ నగర్ చుట్టుప్రక్కల గ్రామాలకు తరలిస్తున్నప్పుడు పట్టుబడినట్లు తెలిపారు. మార్కెట్లో దేశిదారు మద్యం బాటిల్స్ విలువ సుమారు రూ1.80 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న రెండు కార్లను సీజ్ చేసి, మద్యాన్ని, నలుగురు నిందితుల పై కేసునమోదు చేసి విచారణ నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ సుధాకర్ తెలిపారు. సీఐ వెంట ఎస్సై లు సందీప్ కుమార్, సానియా, సిబ్బంది మధు, రమేష్, సంజీవ్, శ్రీను, ఉన్నారు.